
మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు నీళ్లు పోసి జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీవో సంతోష్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని అంతంపల్లి గ్రామంలో నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. అలాగే ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలకు వేసవిని దృష్టిలో ఉంచుకొని అందుబాటులో టెంటు, మంచినీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఏపీవో రాధిక, పంచాయతీ కార్యదర్శి స్నేహ, టి ఏ రాజు, తదితరులు ఉన్నారు.