రైల్వే ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ-హుజూర్‌నగర్‌
ఒడిశాలో జరిగిన ఘోర రైల్వే ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆదివారం దక్షిణ మధ్య రైల్వే బోర్డు యూఆర్‌సీసీ మెంబర్‌ ఎరగాని నాగన్నగౌడ్‌ ఆధ్వర్యంలో మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి రైల్వే ప్రమాదాలు పునరావృతం కాకుండా రైల్వే నిపుణులతో కమిటీని వేసి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నారు. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా రైల్వేల ప్రమాదాల నివారణకు ఆయా ప్రభుత్వ వారు తీసుకుంటున్న రక్షణ చర్యలను పరిశీలించి అధ్యయనం చేయటానికి భారతదేశం నుండి రైల్వే బృందాన్ని పంపించి పరిశీలించి ఆయా దేశాలలో అమలు చేస్తున్న రక్షణ చర్యలను పాటించాలన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను మరింతగా పెంచి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని అవకాశాన్నికల్పించాలని తెలిపారు. రైల్వే గాయపడిన వారికి పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడానికి వచ్చిన వారందరికీ ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాచి మంచి గిరిబాబు, జక్కుల మల్లయ్య, చింతకాయల రాము, వల్లపు దాసు, కృష్ణ, వీరబాబు, కస్తాల సైదులు, రాములు, పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.