
నవతెలంగాణ_బొమ్మలరామారం
రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపడం జరిగింది.వికారాబాద్ ఘటన చాలా దురదృష్టకరమని, అధికారులపై దాడులు చేయడం, ప్రజలకు రెవెన్యూ సిబ్బంది అనేక రకాలుగా అందించే సేవలను విస్మరిస్తూ, పూర్తి అవగాహన రాహిత్యంతో భౌతిక దాడులు దిగడం దుర్మార్గమని అన్నారు. దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని, రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించాలని, అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు.