– కలెక్టర్ రాజర్షి షా
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
జిల్లాలో ఆధార్ సెంటర్లు లేనిమండలాల్లో కొత్త ఆధార్ సెంటర్లు వచ్చే విధంగా చూడాలని కలెక్టర్ రాజర్షి షా రాష్ట్ర యూఐడీఏఐనీ ఆదేశించారు. బుధవారంకలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నాల్గవ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన మండలాలలో జరుగుతున్నటువంటి పీవీటీజీ పీఎం జన్మన్‌లో భాగంగా ఇంకా మిగిలి ఉన్న ఎన్‌రోల్మెంట్స్‌ని తొందరగా పూర్తి చేయాలని సూచించారు. 10 సంవత్సరాల దాటిన వారందరూ ఆధార్‌ని దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్‌లో అప్‌డేట్ చేసుకోవాలని కమిటీ సభ్యులు వారి పరిధిలో దీనిపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్ మార్మాట్, అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, అసిస్టెంట్ కలెక్టర్ అభిగ్యాన్ మలవియ, డీఎస్పీజీవన్ రెడ్డి, రాష్ట్ర యూఐడీఐ అసిస్టెంట్ మేనేజర్ మహమ్మద్ సహౌబన్, ఎల్‌డీఎం, అధికారులు పాల్గొన్నారు.