కర్రపెత్తనం

కర్రపెత్తనంమారణహోమాలు, మాయోపాలు సృష్టించి కుర్చీని కాపాడుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకున్న మోడీ ఏ రాష్ట్రంలో ఎలాంటి చిచ్చుకు తెరలేపు తాడో, ఏ రాష్ట్రంపై ఎప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడో ఊహించడం కాస్త కష్టమే. అందుకే ‘అప్రమత్తంగా లేకుంటే నేడు మణిపూర్‌లో జరుగుతున్న హింసే రేపు కేరళలోనూ జరగవచ్చు’ అని ఆర్థిక రాజకీయవేత్త పరకాల ప్రభాకర్‌ అన్న మాటల్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదనిపిస్తుంది. కాబట్టే అప్రమత్తంగా ఉండమంటూ కొచ్చి వేదికగా ఆయన దేశాన్ని హెచ్చరించి వుంటారు. ఇటీవల కేరళ ఆర్థిక వ్యవస్థపై మోడీ ప్రభుత్వం చూపిస్తున్న నిరంకుశత్వమే దీనికి నిదర్శనం.
రాజును ప్రశ్నిస్తే నాలుక చీల్చేస్తాడు. ఇక ఎదురు తిరిగితే… మరణం తధ్యం. కోటగుమ్మానికి తల వేలా డదీస్తాడు. ఇది రాజరికంలో అనుసరించిన విధా నాలు. కానీ నేటి మన రాజు నాలుకలు చీల్చకుండానే, తలలు నరక్కుం డానే ప్రజాస్వామ్యాన్ని జీవచ్ఛవం చేసే కృషి సీరియస్‌గా చేస్తున్నాడు. రాజ్యాంగ విలువలను గంగలో కలిపేసి తనను ప్రశ్నిస్తున్న రాష్ట్రాలపై కక్షసాధింపుకు కాలు దువ్వుతున్నాడు. కాదు.. కాదు.. ఆయా రాష్ట్రాల ప్రజల గొంతు కోస్తున్నాడు. గత పదేండ్లుగా ప్రజ లు దీన్ని గమనిస్తూనే ఉన్నారు. అసలు రాజ్యాం గాన్నే తమకు అనుకూలంగా మార్చేసుకోవాలని చూస్తున్న మన పెద్దమనిషి దాని విలువలు కాపాడతాడనుకోవడం భ్రమే అవుతుంది.
మొన్నటికి మొన్న ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభు త్వాలను తనకు డబ్బు ఇవ్వడానికి ఏటీఎంలుగా మార్చుకున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్‌ మీడి యా ముందు వాపోయారు. అంతేకాదు విపక్ష పార్టీ లు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు రాకుండా ఆపేస్తున్నారని కూడా చెప్పారు. పైగా కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే మళ్లిస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తమిళనాడులో భారీ ప్రకృతి విపత్తు వచ్చి ప్రజలు అల్లాడిపోయారు. సాయం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం నోరు తెరిచి అడిగినా రాజుగారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటే కక్ష సాధింపులు ఏ స్థాయికి చేరాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అయినా మన రాజుగారికి దేవుడిపై ఉన్నంత ప్రేమ ప్రజలపై ఎందుకుం టుందీ..! అందుకే మణిపూర్‌ ప్రజలు మాడిపోతున్నా, తమిళనాడు ప్రజలు మునిగిపోతున్నా ఆయన హాయిగా రాముని ప్రచారంలో తరించాడు.
ఇక తాజాగా కేరళ అభివృద్ధికి కేంద్రం అడ్డుకట్ట వేస్తుందని లెక్కలతో సహా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. నవ కేరళ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తుంటే అందుకు కేంద్రం అను సరిస్తున్న విధానాలు అడ్డంకిగా మారాయి. న్యాయంగా ఆ రాష్ట్రానికి రావాల్సిన రుణ పరిమితిని కూడా తగ్గించేశారు. రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 280 ప్రకారం ఏర్పడిన ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పక్కనపెట్టేసి కేరళ అభివృద్ధికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రి వర్గం, ఎమ్మెల్యేలు జంతర్‌మంతర్‌ వద్ద ఫిబ్రవరిలో భారీ ధర్నాకు సిద్ధం కాబోతున్నారు.
ఈ విధంగా మన రాజుగారు తన ఆధీనంలో లేని ఆయా రాష్ట్రాలను ఎలాగైనా చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు అందుకు రాజ్‌భవన్‌లను వేదికగా మార్చుకున్నాడు. గవర్నర్లను ఉపయోగించి చేసిన కొన్ని అక్కసు పనులనూ చూశాం. వీసీల నియా మకంలో జరిగిన వార్‌నూ చూశాం. చివరకు కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప, దారికి రాలేదు. అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో కళ్లారా కన్నాం. ఈ నిరంకుశత్వాన్ని భరిం చలేక సుమారు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీపై మండిపడ్డారు. వారి ధాటిని తట్టుకోలేక కాస్త తోకముడిచినట్టు అగుపించినా తన ప్రతాపాన్ని ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉన్నాడు.
ఏదిఏమైనా తన అధికారం కోసం దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను, లౌకికత్వాన్ని మోడీ ప్రభుత్వం నాశనం చేస్తుంద నేది జగమెరిగిన సత్యం. మనది ఫెడరల్‌ వ్యవస్థ. కేంద్రం, రాష్ట్రాల మధ్య సామరస్యం ఉంటేనే ఇది బతికి బట్టకడుతుందని మన రాజ్యాంగ నిర్మాతలు ఆనాడే చెప్పారు. రాష్ట్రాలు లేని కేంద్రం కేవలం ఓ మిథ్య. కానీ ఈ విషయాలన్నీ మరిచి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు మన మోడీగారు. ఈ విధానాల ఫలితంగా రాష్ట్రాలు తమ హక్కులను కోల్పోతున్నాయి. దేశంలో శాంతి కనుమరుగైపోతోంది. ఈ నిరంకుశత్వం ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి పెను ప్రమాదం తప్పదు. ఈ నియంతృత్వ రాజు నుండి దేశాన్ని, రాజ్యాంగాన్ని తద్వారా రాష్ట్రాల హక్కులను, మన ఫెడరల్‌ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజలదే.