
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ దుబే యానం గుట్ట దగ్గర మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు బోర్ వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. సుమారుగా 100 బోర్లకు సంబంధించిన వైర్లు దొంగలించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం వ్యవసాయ భూముల్లో నీరు పారించడానికి రైతులు వచ్చేసరికి స్టార్టర్లను ధ్వంసం చేసి ఉన్నట్టు గుర్తించారు. దీంతోపాటు చుట్టుపక్కల బోర్ల వైర్లను దొంగలించినట్లు గుర్తించారు. సుమారుగా ఒక్క లక్ష 20 విలువగల వైర్లు ఎత్తుకెళ్లినట్లు రైతులు తెలిపారు. రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు .