
గర్భసంచి ఆపరేషన్ వికటించి మహిళకు కడుపునొప్పి వచ్చిన సంఘటన అచ్చంపేటలో చోటు చేసుకుంది స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని బొమ్మని పెళ్లి గ్రామానికి చెందిన లలిత అనే మహిళ వారం రోజుల క్రితం పట్టణంలోని బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ లో గర్భసంచి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ కుట్లు నుంచి రక్తం, చీము వస్తూ ..కడుపునొప్పి తీవ్రంగా రావడంతో సోమవారం మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆపరేషన్ సక్రమంగా చేస్తే.. ఎందుకిలా జరుగుతుందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. కుటుంబ సభ్యుల పట్ల డాక్టర్ అవమానించే విధంగా మాట్లాడడం జరిగిందని బాదితులు ఆరోపించారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న, నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.