గ్రూప్‌ 1 పరీక్షలను ఆపండి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సిట్‌ దర్యాప్తు కొలిక్కి వచ్చే వరకు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ నెల 11న గ్రూప్‌ వన్‌ పరీక్షలను నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రిట్లను జస్టిస్‌ కె.శరత్‌ విచారించి కమిషన్‌కు నోటీసులు జారీ చేశారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను ఈ నెల 5కి వాయిదా వేశారు. కమిషన్‌లో పనిచేసే వాళ్ల నిజాయితీ తేలాలంటే సిట్‌ దర్యాప్తు పూర్తికావాలని పిటిషనర్ల వాదన. ఈ పరిస్థితుల్లో ఈ నెల 11న పరీక్షల నిర్వహణకు కమిషన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ అమలును నిలిపివేయాలని ఆదేశించారు.