– మానవ అక్రమ రవాణా నిర్ములించడం అందరి బాధ్యత
– ప్రజ్వల ప్రాజెక్టు సీనియర్ మేనేజర్ బలరామ కృష్ణ
నవతెలంగాణ-తలకొండపల్లి
మానవ అక్రమ రవాణా ప్రపంచంలోనే అతిపెద్ద నేరం అని, దానిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ప్రజ్వల ప్రాజెక్టు సీనియర్ మేనేజర్ బలరామ కృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని నిర్వహిస్తున్న ఈ శిక్షణ మంగళవారం రెండో వ రోజు కొనసాగింది. ఏపీఆర్ మానవ అక్రమ రవాణా నివారణపై అవగాహనా సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థమానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రజ్వల సంస్థ గత 28 ఏండ్ల నుంచి లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా పనిచేస్తూ 28,500 మంది అమ్మా యిలను కాపాడి, పునరావాసం కల్పించినట్టు వెల్లడించారు. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహిత డాక్టర్ సునీత కృష్ణన్ సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్‌ల సహకారంతో పని చేయనున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అన్ని డీఆర్‌డీఏలోని వీవోఏలకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలను నిరహిం చేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే సంబంధిత అధికారులను ఎలా సంప్రదించలో వివరించినట్టు చెప్పారు.ఈ శిక్షణలో భాగంగా అక్రమ రవాణా సంబంధిత చట్టాలు ఐపీసీ,ఐటీపీఏ, పీవోసీఎస్‌వో, సీహెచ్‌ఎల్‌డీ, మ్యారేజి ఏసీటీల గురించి గ్రూప్ డిస్కషన్ ద్వారా వివరించినట్టు తెలిపారు. లఘు చిత్రాలు, పవర్ పాయింట్ ప్రెసెంటేషయిన్ గ్రూప్ డిస్కషన్ ద్వారా శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని పీడీ, డీఆర్డీఏ, ఏపీఎం తలకొండపల్లి వారి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీఎం మండల శ్రీదేవి, సీసీలు లక్ష్మయ్య, రామ య్య, సత్యం, సుధారాణి, చెన్నయ్య ,ప్రజ్వల సిబ్బంది సురేష్ కుమార్, అనిల్, అంబర్ సింగ్, మితాళి రాజ్, చెన్నమ్మ, స్వప్న , దీపిక ,కల్పన, భాగ్యలక్ష్మి, వీవోలు పాల్గొన్నారు.