నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇసుక వ్యాపారులు అక్రమంగా ఇసుకను తరలిస్తు ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఏర్పాటు చేసి నీరు నిల్వ లేకుండా చేస్తున్నారని, దీంతో చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బోర్ బావుల్లో నీరు లేకుండా చేస్తున్నారని వేంటనే అదికారులు జోక్యం చేసుకుని అరికట్టడానికి చర్యలు చేపట్టాలని తిర్మన్ పల్లి గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ గోపు గోవర్ధన్ అధ్వర్యంలో ఎంపిటిసి చింతల దాస్, సబ్యులతో కలిసి తిర్మన్ పల్లి శివారు లోనే మారి వాగు ను సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొరివాగు నుండి రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక వ్యాపారులు అదికారులతో కుమ్మక్కై రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని వివరించారు. అదికారులకు లంచాలు అంటగట్టి ఇష్టానుసారంగా అడ్డు అదుపు లేకుండా ట్రాక్టర్, టిప్పట్ల ద్వారా ఇసుకను రవాణ చేస్తు లక్షలు రూపాయలు సంపాదించు కుంటున్నరని, పలుమార్లు వారిని హెచ్చరించిన తమకు అదికారులు ఉన్న రాని , మరింత రెచ్చిపోతున్న రాని,ఇదంతా అదికారుల కనుసైగలోనే జరుగుతుందని దీనికి అధికారులు వత్తసు పలికి లంఛలు తిసుకుంటు ఇసుక వ్యాపారులకు మద్దతు పలకం వల్లే, అడ్డు అదుపు లేకుండా వాగునుండి ఇసుక తరలించి రైతులకు తీరని నష్టం కల్పిస్తున్నారని, అక్రమ ఇసుక తరలించకుండ అరికట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇదే విషయమై త్వరలో కలెక్టర్, ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.