పాలస్తీనియన్లపై మారణకాండను ఆపండి

– వెనిజులా నేత మదురో
కారకస్‌ : పాలస్తీనియన్లపై మారణకాండను ఆపాలని వెనిజులా డిమాండ్‌ చేసింది. అమాయకులైన ప్రజలపై ఇక బాంబు దాడులు జరగరాదని అధ్యక్షుడు నికొలస్‌ మదురో పేర్కొన్నారు. ఈ మారణ హౌమానికి తక్షణమే స్వస్తి పలకాలని వెనిజులా ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారన్నారు. ‘పాలస్తీనియన్లను తుదముట్టించాలని వారు భావిస్తున్నారు. యూదులపై అడాల్ఫ్‌ హిట్లర్‌ సాగించిన ప్రణాళికనే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. దీన్ని మానవాళి ఖండిస్తోంది.’ అని మదురో పేర్కొన్నారు. యావత్‌ ప్రపంచ ప్రజలు కూడా తమ వాణిని వినిపి ంచాలని కోరుతున్నానని చెప్పారు.
ఇప్పటివరకు సాగిన ఊచకోతలో 8,300మంది మరణించగా, 21వేల మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. వెనిజులాతో సహా స్పెయిన్‌, అమెరికా, ఫ్రాన్స్‌, టర్కీ, కొలంబియా, జర్మనీ, ట్యునీషియా, పోర్చుగల్‌, అర్జెంటైనాల్లో అనేక ర్యాలీలు, ధర్నాలు, ఆందోళ నలు జరుగుతున్నాయని చెప్పారు. పాల స్తీనా కోసం యావత్‌ ప్రపంచం నినదిస్తోందన్నారు. తక్షణమే కాల్పుల విరమణ జరిగి, ఊచకోతను ఆపాలని అంతర్జాతీయ సమాజం కోరుతోందన్నారు.