భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కామరెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ఆదివారం మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులోని నాగమడుగు కాల్వను పరిశీలించారు. నాగమడుగు లో లెవెల్ బ్రిడ్జి పై నుండి నీరు పరుతున్నందున్న రాకపోకలను నిలిపివేయాలని ఆయన తాసిల్దార్ బిక్షపతిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న గ్రామాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన అన్నారు. అధికారులు అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి బిక్షపతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చండూరి అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.