బిచ్కుందకు నిలిచిపోయిన రాకపోకలు..

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ – బిచ్కుందకు రాకపోకలు నిలిచి పోవడంతో జుక్కల్, బిచ్కుందతో పాటు ఇరువైపుల ఉన్న  ఇతర గ్రామాల వారు జుక్కల్ కేంద్రంనకు రాలేక ఇబ్బందులు గురౌతున్నారు. రెండు నెలల క్రితం జుక్కల్ – బిచ్కుంద వెళ్లేందుకు  రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రుద్రపాహడ్ వద్ద ప్రభూత్వ జూనియర్ కళాశాల ముందు కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న హైలేవల్ బ్రిడ్జి నిర్మాణాలు గుత్తేదారుడు ప్రారంబించారు. వాహనాలకు వెళ్లెందుకు బైపాస్ రోడువేసారు. ప్రస్తుతం నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంనకు ఎగువ నుండి భారీగా నీరు రావడంతో బైపాస్ రోడు వరద ఉదృతికి కొట్టుకొని పోయింది. రాకపోకలు నిలచి పోవడంతో ఇరువైపుల ఉన్న  గ్రామాల  ప్రజలు మండలకేంద్రంనకు  రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది రూపాయల వెచ్చించి నిర్మిస్తున్న హైలేవల్ బ్రిడ్జి ఆర్&బి శాఖ అధికారులకు సోయి లేకుండా పోయింది. వర్ష కాలం సమీపిస్తున్న తరుణంలో రెండు నెలల క్రితం పనులను హడావిడిగా పనులు ప్రారంబించారు. కాంట్రాక్టరుకు కొమ్ము కాసేందేకు వర్షకాలం పొంచి ఉన్న  తెలిసి పనులు ప్రారంబించారు అని మండల వాసులు విమర్శిస్తున్నారు.