– వరద సహాయక చర్యలు చేపట్టిన మాజీ సర్పంచ్ తోడేటి రమేష్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్నాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై ఉన్న పందిల్ల బ్రిడ్జి తెగిపోవడంతో పందిళ్లకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పొట్లపల్లి గ్రామం నుండి పందిళ్లకు మార్గమధ్యలో రొడ్డం పై నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. దీంతో హుస్నాబాద్ రెండు మార్గాల వద్ద వాహనాలు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పందిళ్ళ గ్రామంలో హైవే రోడ్డు పనులు నడవడంతో గ్రామంలో నీటి నిల్వలు పెరిగి ఇంటిలోకి చేరాయి. పందిళ్ళ గ్రామంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. దీంతో గ్రామ మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ గ్రామంలో సహాయక చర్యలు చేపట్టారు. పొట్లపల్లి నుండి పందిళ్లకు వెళ్లే మార్గంలో కల్వర్టు వద్ద జెసిబి తో చెట్లను, మట్టిని తొలగించి నీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు. దీంతో మా గ్రామాల మీద రాకపోకలు కొనసాగాయి.
కల్వర్టు నిర్మాణంతో సమస్యలు దూరం
పొట్లపల్లి మార్గమధ్యలో ఉన్న రోడ్డం వద్ద కల్వర్టు నిర్మిస్తే రాకపోకలకు అంతరయం లేకుండా ఉంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వా పోతున్నారు. ఇప్పటికైనా మంత్రి పొన్న ప్రభాకర్ రొడ్డం వద్ద కల్వర్టు నిర్మించి సమస్యలు పరిష్కరించాలని పందిల్ల, పొట్లపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.