– బాధిత రైతుల పక్షాన పోరాడిన సంఘాలకు ధన్యవాదాలు
– తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో ఎలాంటి భూసేకరణ చేపట్టబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయడం గిరిజన, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల విజయమని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్ శుక్రవారం ు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఇష్టారాజ్యంగా పరిశ్రమల పేరుతో భూసేకరణ చేపడితే ప్రజలు ఎలా తిరగబడతారో లగచర్ల ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు.అక్కడి బాధిత గిరిజనులు, దళితులు, పేదల పోరాటానికి గిరిజన,ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు అండగా నిలిచి పోరాటాన్ని ఉధృతం చేశాయని తెలిపారు.
లగచర్ల బాధిత రైతులతో పాటు అండగా వెళ్లిన గిరిజన,ప్రజా సంఘాల నాయకులు ఆప్రాంతానికి వెళ్లనీయకుండా పోలీసులద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ అరెస్టులకు పాల్పడి యుద్ధ వాతా వరణాన్ని సృష్టించిందని గుర్తు చేశారు. పోలీసు నిర్బం ధాలను సైతం లెక్కచేయకుండా ఆందోళనలు కొనసాగించిన గిరిజన, ప్రజా సంఘాలు ,వామపక్ష పార్టీలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.