పవర్‌ఫుల్‌ పోలీస్‌ కథ

Story of Powerful Policeఆది సాయికుమార్‌ హీరోగా యశ్వంత్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘SI యుగంధర్‌’. శ్రీ పినాక మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ప్రదీప్‌ జూలూరు నిర్మిస్తున్న క్రైమ్‌-యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. రాకేందు మౌళి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ కథానాయిక. శనివారం పూజా కార్యక్రమంతో ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సందీప్‌ కిషన్‌ క్లాప్‌ ఇచ్చారు. మేకర్స్‌కి సాయికుమార్‌ స్క్రిప్ట్‌ అందించారు. ఈ సందర్భంగా మేకర్స్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని లాంచ్‌ చేశారు. హీరో ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ,’యంగ్‌ టీమ్‌తో కలిసి పని చేస్తున్నాం. చాలా కొత్తగా ప్రజెంట్‌ చేస్తారని నమ్మకం ఉంది. కంటెంట్‌ నమ్మి సినిమా చేస్తున్నాం. ప్రదీప్‌ చాలా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. ఈటీవీ వారికి థ్యాంక్స్‌. ఈ సినిమా కథ నచ్చి, వాళ్ళు రైట్స్‌ తీసుకుని, సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 18 నుంచి షూట్‌ స్టార్ట్‌ కాబోతుంది. ఈసారి ఖచ్చితంగా హిట్‌ కొడుతున్నాం’ అని తెలిపారు. డైరెక్టర్‌ యశ్వంత్‌ మాట్లాడుతూ,’చాలా యూనిక్‌ థ్రిల్లర్‌ ఇది’ అని అన్నారు. ‘ఈ సినిమాలో నేను ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుంది’ అని రాకేందు మౌళి తెలిపారు. నిర్మాత ప్రదీప్‌ మాట్లాడుతూ,’ఇది చాలా డిఫరెంట్‌ స్టోరీ. ఈ కథ వినగానే మా మైండ్‌లోకి ఆది వచ్చారు. ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆయనకి, ఈ సినిమా చేస్తున్న ఈటీవీ వారికి కృతజ్ఞతలు’ అని అన్నారు.