పరాయి వ్యక్తులను తాండూరు నుంచి తరిమికొట్టాలి

– ఎన్నికల్లో తాండూరు పౌరుషాన్ని చూపిద్దాం
– ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి పైలట్‌ 2వ రోజు
– పాదయాత్రకు విశేష స్పందన
నవతెలంగాణ-తాండూరు
తాండూరు. నుండి పరాయి వ్యక్తులను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి అన్నారు. శనివారం తాండూర్‌ పట్టణ కేంద్రంలోని మల్‌రెడ్డిపల్లి, ఇందిరానగర్‌, వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజల నుండి భారీ స్పందన లభించింది. పాదయాత్రలో ప్రజలు ఎమ్మెల్యేతో కలిసి నడిచారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఎన్నికల కోసమే తాండూరులో పరాయి వ్యక్తు లు వాలిపోయారు అన్నారు. ఈనాడు తాండూరు అభివృద్ధి కోసం పట్టించుకోని నాయకులు నేడు ఎన్ని కల లబ్ది కోసం తాండూరు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రం పెట్టి డబ్బు సం చులతో రాజకీయం చేయాలనుకుం టున్నారన్నారు. ఇన్ని రోజులు తాండూరు మొహం చూడని వ్యక్తులు ఇప్పుడు తాండూరు బాగు చేస్తామని అనడం విడ్డరం గా ఉందన్నారు. నేను తాండూరు బిడ్డను చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మీ ఆశీర్వాదంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఎన్నికల్లో తాండూరు పౌరు షాన్ని చూపిద్దామని పరాయి వ్యక్తులను తరిమి కొట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న పరిమల్‌, వైస్‌ చైర్మన్‌ దీపా నర్సింలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వీణ శ్రీనివాస్‌ చారి, నాయకులు అప్పు నయీమ్‌, జుబేర్‌ లాల, టిప్పు సుల్తాన్‌, భాను కుమార్‌, రాజన్‌ గౌడ్‌, ఇంతియాజ్‌, బీఆర్‌ఎస్‌ నాయ కులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.