నవతెలంగాణ-గోవిందరావుపేట : ఎన్నికల నేపథ్యంలో అపరిచితులకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఆశ్రయము కల్పించరాదని పసర ఎస్ ఐ షేక్ మస్తాన్ అన్నారు. గురువారం ఎస్ ఐ షేక్ మస్తాన్ తన సిబ్బందితో కలిసి ప్రాజెక్టు నగర్ గ్రామ సమీపంలోని గుత్తి గుంపును సందర్శించి మాట్లాడారు.ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామం కు వస్తే తమకు సమాచారం అందించాలని తెలియచేసారు. గ్రామంలో ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం గుత్తికోయ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు.