మంతన్‌గౌరెల్లిలో వీధి కుక్కల దాడి

– తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు, ఓ బాలుడు
– గాయపడిన వారిని ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-యాచారం
వృద్ధురాలిపై, చిన్న పిల్లలపై వీధి కుక్కలు తీవ్రంగా దాడి చేసిన ఘటన యాచారం మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంతన్‌ గౌరెల్లి లో రామావత్‌ ద్వాలి, సభావత్‌ శంకర్‌ లపై వీధి కుక్క తీవ్రంగా దాడి చేశాయి. ఏకంగా ఆ పిచ్చి కుక్క వృద్ధురాలి ముఖంపై కరిచింది. ఆ వీధి కుక్క ఇంతటితో ఆగకుండా శంకర్‌ అనే బాలుడిపై దాడి చేసింది. వీధి కుక్క దాడిలో గాయ పడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గతంలో కూడా తమ గ్రామంలో వీధి కుక్కల దాడి చేస్తున్నాయని తెలిపారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదన్నారు. గ్రామంలో ఇంకా ఎంతమంది కుక్కలు దాడి చేస్తాయోనని ప్రజలందరూ భయాదోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీధి కుక్కల దాడి నుంచి గ్రామ ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.