ఆవు, లేగ దూడలపై వీధి కుక్కల దాడి

ఆవు, లేగ దూడలపై వీధి కుక్కల దాడినవతెలంగాణ-మేడ్చల్‌
ఆవు, లేగ దూడలపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపి న వివరాల ప్రకారం మున్సిపాలిటీకి చెందిన నరేందర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఆవు,మూడు నెలల దూడ రోజు వారిగా గడ్డి మేయడానికి వెళ్లాయి. అటువైపుగా వచ్చిన పదుల సంఖ్యలో ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా ఆవు, దూడపై చెవులు,గొంతు కొరికి తీవ్రంగా దాడి చేశాయి. కాగా ఇటీవలే 7వ వార్డు బాసిరేగడిలోని ఇద్దరి మహిళలపై సైతం వీధి కుక్కలు దాడి చేసినట్టుగా స్థానికులు తెలిపారు. మున్సిపాలిటీలో రోజురోజుకు వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయని వాపోయారు. వాటిని అరికట్టి గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ ప్రజలను కాపా డాలని పలువురు కోరుతున్నారు. వీధి కుక్కల దాడులతో చిన్నపిల్లలు ఇంట్లో నుండి బయటకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొని కుక్కల దాడుల నుంచి ప్రజలను కాపాడాలని చిన్నారుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.