నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని తిరుమల కాలనీలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తిరుమల కాలనీ నుండి శ్మశాన వాటిక వైపు వెళ్లే మార్గంలో వీధికుక్కలు గుంపులుగా సంచరిస్తుండడంతో మహిళలు, చిన్నపిల్లలు భయపడు తున్నారు. రాత్రి వేళలో పాదాచారులు, ద్విచక్ర వాహన దారులను వీధి కుక్కలు వెంబడిస్తున్నాయి. అలాగే కాలనీలో పందుల బెడద కూడా నెలకొందని స్థానికులు తెలిపారు.