
– మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి..
నవతెలంగాణ – మీర్ పేట్
ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని మీర్ పేట్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్, జల్ పల్లి, తుక్కుగుడ మున్సిపాలిటీలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులుగా, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పని చేస్తున్నామని తెలిపారు. దాదాపు 30సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలతో దుర్బేద్యమైన జీవితాలను అనుభవిస్తున్నమని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలుక్ ఆకాశాన్ని అంటాయి. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, ఆరోగ్యం తదితర అవసరాలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఇటీవల విఆర్ఏలను క్రమబద్ధీకరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మమ్మల్ని(మున్సిపాలిటీలలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు) క్రమబద్ధీకరణ చేస్తారని కోరారు. అసెంబ్లీలో తీర్మానం చేసి మమ్మల్ని క్రమబద్ధీకరణ చేయగలరని విన్నవించారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, శివ గౌడ్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.