– కేకేతో ఆరోపించిన గ్రామస్తులు..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
మా గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదని పంచాయతీ కార్యదర్శి సరిగా పనిచేయడం లేదని గ్రామస్తులు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డికి విన్నవించారు. మండలంలోని ఇందిరమ్మ కాలనీ పరిధిలోని సారంపల్లి ఇందిరమ్మ కాలనీలో రాత్రి అయితే చాలు వీధి దీపాలు వెలగక చిమ్మ చీకట్లో గడుపుతున్నామని, ఎన్నిసార్లు పంచాయతీ కార్యదర్శి కి విన్నవించిన, మొరపెట్టుకున్న, ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని కేకే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే కేకే స్పందించి త్వరగా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పంచాయతీ కార్యదర్శి చూడాలన్నారు.