– వ్యాపారులకు శిక్షణ తరగతులు
– సర్టిఫికెట్ల అందజేత
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ వండర్స్ ఆఫ్ ఇండియా నాస్తి, నెస్లీ సంస్థ వారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తో అనుసంధానమై నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని వీధి ఆహార వ్యాపారస్తులకు బుధవారం నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఆహార నాణ్యత ప్రమాణాలపై సుచి శుభ్రత, ఆహార వీధి వ్యాపారులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వీధి వ్యాపారులంతా పరిశుభ్రతను పాటించాలని కోరారు. వీధి వ్యాపారులంతా ఎస్ ఎస్ ఏ ఐ రిజిస్ట్రేషన్ ని తప్పనిసరిగా తెలిపారు. అనంతరం నల్గొండ జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయి, యాదాద్రి గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ పాల, నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి. స్వాతి, మెప్మా పీడీ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ లతో కలిసి ఆహార ప్రమాణాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసి 130 మంది ఆహార వీధి వ్యాపారస్తు లకు ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ సర్టిఫికెట్ ను అందజేశారు.