నవతెలంగాణ-బెజ్జంకి
బలమే జీవితమని.. బలహీనతే మరణమని స్వామి వివేకానంద భోదనలు యువత భవిష్యత్తుకు దోహదపడుతాయని.. వివేకానందుని ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని కొనసాగించాలని ఎంపీపీ నిర్మల సూచించారు.శుక్రవారం మండల కేంద్రంలో యువ ప్రెండ్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వామి వివేకానంద జయంతిలో ఎంపీపీ నిర్మల, తహసీల్దార్ శ్యామ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య, లయన్స్ క్లభ్ అధ్యక్షుడు రాజ్ ఫురోహిత్ భగత్ సింగ్ పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని వివేకానంద విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భోదన సిబ్బంది, విద్యార్థులు హజరయ్యారు.