– విరివిరిగా విరాళాలు ఇవ్వండి
– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-సంగారెడ్డి
సీఐటీయూ మాజీ వ్యవస్థాపక అధ్యక్షులు బి.టి రణదీవే వర్ధంతి ఏప్రిల్ 6 నుంచి అంబేద్కర్ జయంతి వరకు మహనీ యుల జయంతి వర్ధంతిల సందర్భంగా సామాజిక సంఘీ భావ నిధిని ఆదివారం సంగారెడ్డిలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వర్ధంతి ల సందర్భంగా సామాజిక ఉద్యమాల సంఘీభావనిధిని వసూలు చేసి సామాజిక సంఘాలకు అందిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత బహుజన మైనార్టీల సమ స్యలు పరిష్కారం చేయకుండా వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న దుస్థితి ఉన్నదన్నారు. దేశంలో నేటికీ కుల వివక్షత, అంటరానితనం, పేదరికం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. పాలకులు వివక్షతను రూపుమాపకుండా చోద్యం చేస్తున్నదన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దళిత గిరిజన మైనార్టీల పట్ల కక్షపూరితంగా కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో దాడులను ప్రోత్స హిస్తుందని మండిపడ్డారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దళిత బహుజనులు అందరూ తమ ఓటు హక్కు ద్వారా బీజే పీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. బీజేపీని ఎన్నికల్లో ఓడిస్తేనే దేశంలో దళిత బహుజనుల మనుగడ సాధ్యమన్నారు. సామాజిక న్యాయం, మతసామరస్యం, ఆర్థిక సమానత్వం, కుల నిర్మూలన, వంటి లక్ష్యాల సాధన కోసం సీఐటీయూ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలను నిర్వహిస్తున్న దన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల కూడా కులం పేరుతో మతం పేరుతో విభజించి పాలించాలనే విధంగా చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక ఉద్య మాలకు సీఐటీయూ సంఘీభావంగా అన్ని రకాల తోడ్పా టును భవిష్యత్తులో అందిస్తుందని ప్రత్యక్ష పోరాటాల్లో భాగ స్వామ్యం అవుతామన్నారు. ప్రజలు సామాజిక ఉద్యమాలను బలపరిచి విరివిరిగా విరాళాలు ఇచ్చి ప్రజా ఉద్యమాలు బల పరచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, కోశాధికారి రాజయ్య, ఉపాద్యయక్షులు ప్రవీన్, మైపాల్, సహాయ కార్యదర్శి యాదగిరి, విద్యాసాగర్, రాజిరెడ్డి, పాండురంగారెడ్డి, బాబురావు, సురేష్, నాగేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.