– జిల్లా అధ్యక్షులు గాజుల వెంకటేష్
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని బహుజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల వెంకటేష్ అన్నారు. సోమవారం అచ్చంపేటలో ( బి టీ ఏ ) బహుజన ఉపాధ్యాయ సంఘం 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడారు. సంఘం ఆవశ్యకత, నేపథ్యాన్ని వివరిస్తూ.. బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్ మహనీయుల స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, మూఢనమ్మకాల నుంచి సమాజాన్ని చైతన్యం చేయడానికి సంఘాన్ని 2001న ఏర్పాటు చేశామన్నారు. దానికి అనుగుణంగా ఉపాధ్యాయులం అందరం అంకితభావంతో పని చేద్దామని తెలియజేశారు. బహుళ తరగతి బోధన వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని , ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిపడా లేని దగ్గర విద్యా వాలంటీర్లను నియమించాలని, మౌళిక వసతులు, స్కావెంజర్ ల ను నియమించాలన్నారు. బడ్జెట్ లో విద్యా శాఖకు 15% నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్న 5 డీఏ లు విడుదల చేయాలని, పీఆర్సీ ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నారుమోళ్ళ రవిందర్, వివిధ మండలాల నాయకులు యం. శ్రీనివాసులు, బి.భూపతి కుమార్, యం. రంజిత్ కుమార్, కె. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.