స్ట్రెస్‌.. స్ట్రెస్‌… స్ట్రెస్‌..

Stress స్ట్రెస్‌.. స్ట్రెస్‌… స్ట్రెస్‌.. ఎక్కడ చూడండి.. ఇవాళ్ల రేపు పొద్దస్తమానం ఈ పదమే వింటున్నాం. స్ట్రెస్‌ అంటే ఏంటి? ఇది మనకు అవసరమా? అనవసరమా?
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్ట్రెస్‌ మనకు అవసరం. అవునండీ.. నిజం! ఇది ఒక కోపింగ్‌ మెకానిజం. అంటే మనం ఏదైనా కష్టతరమైన పరిస్థితిని (సిచ్యువేషన్‌) ఎదుర్కొన్నప్పుడు దానిని ఓవర్‌కమ్‌ చెయ్యడానికి లేదా సాల్వ్‌ చెయ్యడానికి స్ట్రెస్‌ రెస్పాన్స్‌ చాలా ముఖ్యం. అవసరం కూడా.
స్ట్రెస్‌ రెస్పాన్స్‌లో భాగంగా మనలో కొన్ని ఫిజియోలాజికల్‌ ఛేంజెస్‌ జరుగుతాయి. ఇవి ఏంటంటే ముఖం ఎర్రబడడం, కంటిపాప పెద్దగా అవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, హైటెన్డ్‌ ఎమోషనల్‌ స్టేట్‌లోకి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే ‘ఫ్లైట్‌ ఆర్‌ ఫైట్‌’ రెస్పాన్స్‌ అంటాం. అంటే నిలబడి, ఎదుర్కొని ఫైట్‌ చెయ్యడం, లేదా తప్పించుకుని పారిపోవడం. మన శక్తిని, పరిస్థితిని అంచనా వేసి ఫైట్‌ లేదా ఫ్లైట్‌ (సిచ్యువేషన్‌) అనేది మనం నిర్ణయించుకుంటాం.
జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి యాంక్జైటీ, ఫియర్‌ రూపంలో ఈ ఫైట్‌ లేదా ఫ్లైట్‌ రెస్పాన్స్‌ అప్పుడప్పుడు మనకు కలుగుతూ వుంటుంది.
అయితే ప్రతి మనిషి స్వభావం (మైండ్‌ సెట్‌), శక్తి, సామర్ద్యాలు ఇంకా అనేక విషయాల మీద ఈ స్ట్రెస్‌ రెస్పాన్స్‌ ఆధారపడి వుంటుంది. దీని ఫలితంగా వచ్చే మార్పులు మనలో ఎంతసేపు వుంటాయి, తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందనేది ప్రతి మనిషికీ మారుతూ వుంటుంది.
ఎప్పుడైతే ఈ స్ట్రెస్‌, క్రోనిక్‌ స్ట్రెస్‌గా మారుతుందో అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కార్టిసాల్‌, నోరాడ్రినలిన్‌, అడ్రినలిన్‌ అనే హార్మోన్లు పెరిగి, మన ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతాయి. వాటిలో కొన్ని ఇప్పుడు వివరిస్తాను.
ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ పెరిగి ప్రీడయాబెటీస్‌, డయాబెటీస్‌ రావడం; బీపీ, గుండెకు సంబంధించి సమస్యలు రావడం; ట్రైగ్లిజరైడ్స్‌, చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం; ఎముకలు, కండరాలు బలహీన పడడం; ఊబకాయం రావడం (ముఖ్యంగా సెంట్రల్‌ లేదా అబ్‌డోమినల్‌ ఒబెసిటీ); ఇమ్యూనిటీ తగ్గిపోవడం; పీరియడ్స్‌, ఇతర హార్మోన్‌ సమస్యలు; ఫర్టిలిటీ ఇష్యూస్‌ రావడం; పిసిఒఎస్‌; జుట్టు ఊడిపోవడం; జీర్ణకోశం పనితీరు మారిపోవడం; అల్సర్స్‌ రావడం ఇలా చెప్పుకుంటూ పోతే మన శరీరంలోని ప్రతి కణం, ప్రతి అవయవం పనితీరు క్రోనిక్‌ స్ట్రెస్‌ వల్ల ప్రభావితమవుతుంది.
అలాగే భయం, డిప్రెషన్‌, యాంగ్జైటీ పెరగడం, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి మనం సరైన బ్యాలెన్స్‌డ్‌ న్యూట్రిషన్‌, వ్యాయామానికి ఎంత ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఇస్తామో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ కోసం రెస్ట్‌, రిలాక్సేషన్‌, నిద్రకి కూడా ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ స్ట్రెస్‌ రెస్పాన్స్‌ ఫలితంగా కలిగే కెమికల్‌ ఛేంజెస్‌, ఫిజియోలాజికల్‌ ఛేంజెస్‌ వల్ల మన ఎమోషన్స్‌ బాలెన్స్‌ తప్పుతాయో అప్పుడు కోపం కూడా పెరుగుతుంది. చాలా సందర్భాల్లో లో గా ఫీలవడం మొదలవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకదానికి ఒకటి రిలేటెడ్‌గా వుంటాయి. ఇలా లో గా ఫీలయినప్పుడే చాలా వరకు వ్యసనాలకు బానిసలవుతుంటారు. ఒక్కసారి అలవాటైన తరువాత బయటపడడం చాలా కష్టమవుతుంది. అందుకే మొదట్లోనే స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎమోషనల్‌ రెగ్యులేషన్‌ నేర్చుకోవడం ద్వారా వ్యవసాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.
ఈ రోజుల్లో క్రోనిక్‌ స్ట్రెస్‌కి ఎన్నో ముఖ్య కారణాలున్నాయి. ఇందులో ఒక పది కామన్‌ కారణాలను చూద్దాం…
1. సోషల్‌ మీడియా వాడకం ఎక్కువైపోవడం
2. ఇతరులతో కంపేర్‌ చేసుకోవడం, చిన్న వయసులోనే సెటిల్‌ అవ్వాలని ఆత్రుత (ఇతరులతో కంపేర్‌ చేసుకుని). త్వరగా కోట్లు సంపాదించాలని జీవితంలో అన్నీ వదిలి పెట్టి డబ్బు కోసం పరుగెత్తడం.
3 హెల్త్‌ సంబంధించిన కంటెంట్‌ ఎక్కువగా (అథెంటిక్‌ సోర్స్‌ నుంచి కాకుండా) చదివి, ఏదేదో ఊహించుకుని భయానికి గురవ్వడం.
4. ఆధ్యాత్మిక చింతన లేకపోవడం.
5. సెల్ఫ్‌ డిసిప్లిన్‌కి, హెల్తీ లైఫ్‌ స్టైల్‌ కి అసలు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం.
6. చెడు సావాసాలు చేసి తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొని ఒత్తిడికి గురవ్వడం.
7. ధూమపానం, మద్యపానం చిన్న వయస్సు నుంచి అలవాటు చేసుకోవడం.
8. ఇంటిలో తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం, సరైన ఎన్విరాన్‌మెంట్‌, కన్వెక్షన్‌ లేకపోవడం.
9. వర్క్‌ ప్లేస్‌లో తీవ్ర ఒత్తిడి వుండడం, సరైన ఎన్విరాన్‌మెంట్‌ లేకపోవడం.
10. అనవసరమైన నెగిటివ్‌ విషయాలు ఎక్కువగా చూడడం, డిస్కస్‌ చేయడం. ఇందులో కొన్ని బిన్జ్‌ వాచింగ్‌, వెబ్‌ సిరీస్‌, సీరియల్స్‌, న్యూస్‌ అధికంగా చూడడం.
స్ట్రెస్‌… ముఖ్యంగా క్రోనిక్‌ స్ట్రెస్‌ గురించి పూర్తి అవగాహనతో అది మన ఆరోగ్యం, జీవితంపై చూపే ప్రభావం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ గురించి డిస్కస్‌ చేద్దాం.
యోగా, వ్యాయామం
మెడిటేషన్‌
రిలాక్సేషన్‌ కోసం మనకు ఎంతో ఆహ్లాదం కలిగించే హాబీస్‌, పెయింటింగ్‌, గార్డెనింగ్‌, మ్యూజిక్‌ వినడం, డాన్స్‌.
సపోర్టివ్‌గా వుండే ఫ్రెండ్స్‌, స్ట్రాంగ్‌ ఫామిలీ కనెక్షన్స్‌.
సెట్టింగ్‌ బౌండరీస్‌, సంభాషణను సున్నితమైన భాషలో స్పష్టంగా, దృఢంగా వ్యక్తపరచడం. (క్లియర్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ జెంటిల్‌ ఫర్మ్‌ లాంగ్వేజ్‌)
సోషల్‌ మీడియా, న్యూస్‌ ఇలా ఓవరాల్‌గా స్క్రీన్‌ టైం రోజులో రెండు గంటలకంటే మించకుండా చూసుకోవడం.
అవసరమైనప్పుడు ప్రొఫెషనల్స్‌ హెల్ప్‌ తీసుకోవడానికి వెనుకాడకూడదు.
మంచి పుస్తకాలు చదవడం.
చారిటీ చేయడం.
మనం చేసే వృత్తి ప్రయోజనకరంగా, అర్ధవంతంగా వుండేలా చూసుకోవడం.. ఇలా మరెన్నో.
సో ఫ్రెండ్స్‌, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం అందరికీ వుండాలి.
Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314