ఎన్నికల శిక్షణ తరగతులు హాజరు కాని వారిపై కఠిన చర్యలు

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
షోకాజ్ నోటీసులు స్వీకరించిన 38 మంది ఓ పి ఓ లకు విచారణ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరం లో ఈ నేల ఆరవ తేదీన నిర్వహించిన శిక్షణ తరగతులకు హజరుకాని 38 మందిని కలెక్టర్ వారి వివరణ స్వీకరించారు. దానిలో కొంతమంది విధులకు హాజరు అవుతామని తెలిపారు. ఎ కారణం లేకుండా రాని వారిపై సివిల్ ,క్రిమినల్ కేసులు అలాగే అట్టి వారి పేర్లను ఎలక్షన్ కమిషన్ కు పంపబడతాయని సెక్షన్ 28 ప్రకారం వారిపై చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.