మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు

– షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ కాంతారెడ్డి
నవతెలంగాణ-షాబాద్‌
చట్ట విరుద్ధంగా మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ కాంతారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం షాబాద్‌ మండల పరిధిలోని హైతాబాద్‌, షాబాద్‌ తదితర గ్రామాల్లోని పాన్‌ షాపుల్లో తన పోలీస్‌ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాపుల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయంపై పరిశీ లించారు. ఇండిస్టియల్‌ పరిధిలో ఉన్న హైతాబాద్‌ గ్రామంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యో గులు అధిక మొత్తంలో పని చేస్తుండడం వలన, ఇక్కడ మత్తు పదార్థాలు విక్రయం పై నిఘా పెట్టి నట్టు తెలిపారు. చట్ట విరుద్ధంగా ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఆయన వెంట పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.