ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు 

Strict action for sale of narcotic drugs without prescription– ప్రతి ఒక్కరు నిబంధన ప్రకారం నడుచుకోవాలి
– రిపీటెడ్ గా మందులు వాడే వారి వివరాలను తెలపాలి
– అడిషనల్ యస్పీ రాములు నాయక్ 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే  టాబ్లెట్స్, ఇంజెక్షన్‌లు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ హెచ్చరించారు. నల్లగొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యంగా మిషన్ పరివర్తన్ లో బాగంగా  జిల్లా యస్పీ శరత్ చంద్ర  ఆదేశాల మేరకు సోమవారం అడిషనల్ యస్పీ రాములు నాయక్  ఆద్వర్యంలో   నల్ల్గొండ పట్టణంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ యజమానులతో ప్రకాశం బజార్ లోని కెమిస్ట్  అండ్   డ్రగ్గిస్ట్స్ అస్సోసియేషన్ హాల్ నందు  సమావేశం నిర్వహించడం  జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లాలో  ప్రతి మెడికల్ షాప్ యజమానులు సంబంధిత నార్కోటిక్ డ్రగ్స్ విక్రయించుటకు నియమ నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉండాలని, లైసెన్స్ ప్రకారమే మందులు విక్రయించాలని తెలిపారు. ఎలాగైతే షెడ్యూల్ హెచ్, హెచ్ 1, ఎక్స్ ప్రకారం సంబంధిత లైసెన్స్  కలిగి ఉన్న వారు మాత్రమే సంబంధిత మందులు విక్రయించాలని అన్నారు. ఏవరైన డ్రగ్ లైసెన్స్ లేకుండా  ఔషధాలను విక్రయించిస్తే  స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని  తెలిపారు. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా  ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయిస్తున్నందున, ఇటీవల నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాలల్లో  మెడికల్ షాప్ పైన కేసు పెట్టడం జరిగిందనీ తెలిపారు.18(సి) ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 27(బి)(i) ప్రకారం సంబంధిత లైసెన్స్ ప్రకారం బిల్ నంబర్,డాక్టర్ పేరు, వినియోగదారుని పేరు డ్రగ్ పేరు, అన్ని రిజిస్టర్ లో నమోదు చేయాలని, లేని యడల శిక్షారులు అవుతారని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఎంపీలకు  మత్తు మందులు విక్రయించకూడదని స్పష్టం చేశారు. విక్రయించకుడని అన్నారు. ప్రతి ఒక్కరు నిబంధన ప్రకారం నడవాలని సూచించారు.  రిపిటెడ్ గా మందులను వినియోగించే వారి సమాచారం సంబందిత యజమానులు అందిచాలని అన్నారు. అట్టి సమాచారం  జిల్లా పోలీసు కార్యాలయం డ్రగ్ కంట్రోల్ పోన్ నంబర్ 8712670266 కి తెలియపరచాలని వారి  వివరాలు గోప్యంగా ఉంచబతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డియస్పీ శివరాం రెడ్డి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అశ్విన్ కుమార్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేంకటపతి, సెక్రెటరీ పరమాత్మ, ట్రెసరరీ గోవిందు,  మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.