నాలాల భూములు  ఆక్రమిస్తే కఠిన చర్యలు

– ఆర్డీవో కోమల్ రేడ్డి
నవతెలంగాణ-ముధోల్  రోడ్డుకు  ఇరువైపులా ఉన్న నాళాల భూములను  ఏవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బైంసా ఆర్డిఓ కోమల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గం  కేంద్ర మైన ముధోల్ లో బస్టాండ్ సమీపంలో ఉన్న రోడ్డు అవతలి వైపు  భూమి ఆక్రమణకు గురి  కావడంతో వర్షం కురిసినప్పుడు తరుచు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. దీంతో శుక్రవారం ఆర్డీవో కోమల్ రేడ్డి , తహశీల్దార్ శ్రీకాంత్,  సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఆర్డిఓ దగ్గరుండి జేసిపి ని  తెప్పించి  రోడ్డుకు అవతలి వైపు గతంలో ఉన్న కాలువను తవ్వించారు. ఈసందర్భగా  ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా వర్షపు నీరు, మురికి నీరు , వెళ్లడానికి కాలువను తవ్వించామన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. చట్టం అందరికి సమానమే అన్నారు. ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముధోల్ సిఐ మల్లేష్, ఆధ్వర్యంలో ఎస్ఐ సాయికిరణ్, పోలిస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆర్ ఐ నారాయణ పటేల్, పంచాయతీ ఈవో ప్రసాద్ గౌడ్,రేవేన్యు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.