– క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
– టాస్క్ ఫోర్ట్ అధికారులు
– టాస్క్ ఫోర్ట్ అధికారులు
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా, మేనూర్, మద్నూర్, ఈ మూడు గ్రామాల్లో మంగళవారం నాడు టాస్క్ఫోర్స్ టీం అధికారులు ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో గల ఫార్టిలైజర్ విత్తన అమ్మకాల దుకాణాలను తనిఖీలు చేపట్టి దుకాణాల్లో గల విత్తనాలు రసాయన ఎరువులు పరిశీలించారు విత్తనాలు అమ్మే డీలర్లకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ముఖ్యంగా విత్తన డీలర్లు విత్తనాలను ఎక్కడి నుంచి తెచ్చారు , ఏ ఏ కంపెనీ విత్తనాలు తెచ్చారు డాక్యుమెంట్ ఉండాలన్నారు . ఆదేశాలు జారీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసు పెట్టడం జరుగునని బాన్సువాడ ఏ డి ఏ తెలపడం జరిగింది.
అలాగే ప్రతి డీలర్లు లైసెన్స్ కాపీ, స్టాక్ బోర్డ్, బిల్ బుక్ తప్పకుండా ఉండాలని తెలియజేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో బాన్సువాడ ఏవో సుధాకర్, మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు పాల్గొన్నారు.