– హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ సైట్ ఇన్‌చార్జి గౌతమ్
– మియాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
నవతెలంగాణ-మియాపూర్
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ సైట్ ఇన్‌చార్జి గౌతమ్ హెచ్చరించారు. హైదరాబాద్ మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 ప్రభుత్వ భూముల్లో కొందరు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టగా.. శుక్రవారం హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులు ఆ అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. అమాయక ప్రజలు కొంతమంది రియల్టర్ల మాట లు నమ్మి ప్రభుత్వ భూములు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఎవరూ మధ్యవర్తుల మాటలు నమ్మి ప్రభుత్వ భూములు కొనుగోలు చేయొద్దని సూచించారు. నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం ఎవరు చేసినా తమకు సమా చారం ఇవ్వాలని కోరారు. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సందర్శించిన వారిలో.. శేరిలింగంపల్లి ఆర్‌ఐ శ్రీనివాస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై సంతోష్‌రెడ్డి, రెవెన్యూ హెచ్‌ఎండీఏ సిబ్బంది ఉన్నారు.