
నవతెలంగాణ కమ్మర్ పల్లి
సంక్రాంతి పండుగ నేపథ్యంలో పతంగులను విక్రయించే షాపుల యజమానులు చైనీస్ మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పలు కిరాణా షాపులను, పతంగులను విక్రయించే దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. చైనీస్ మాంజా వల్ల కలిగే ప్రమాదాలపై ఈ సందర్భంగా ఆయన షాపుల యజమానులకు అవగాహన కల్పించారు. చిన్నారుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చైనీస్ మాంజను ఉపయోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చైనీస్ మాంజలు ఉపయోగించడం వలన జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా ఉన్నాయని, చైనీస్ మాంజల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. షాపుల్లో చైనీస్ మాంజలను నమ్మితే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు.