నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమయ పాలన పాటించని ఉద్యోగులకు కఠిన చర్యలు తప్పవని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించా రు.హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని తెలంగాణ టూరిజం డెవలప్‌మెం ట్ కార్యాలయాన్ని (టీజీటీడీసీ) గురువారం మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. రిసెప్షన్‌లో ఉన్న హాజరు పట్టిక, బయోమెట్రిక్‌లో అటెండెన్స్‌ను పరిశీలించారు. ప్రతీ ప్లోర్‌ను కలియ తిరిగి ఉద్యోగుల వివరాలపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో సిబ్బంది రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమి చ్చాయి. ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటే ఏం చేస్తున్నారని ఎమ్‌డీ రమేశ్‌నాయుడుపై ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.