
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలుంటాయని ముత్తారం ఎస్‌ఐ మధుసూదన్ రావు హెచ్చరించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మైనర్స్ ద్విచక్ర వాహనాలపై రావడం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, ఇష్టానురీతి వాహనాలను నడుపుతూ పరీక్ష కేంద్రాలకు వస్తున్నారని, ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే వాహనం నడిపిన వారికే కాకుండా ఎదుటి వారి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనాలు ఇచ్చిన కూడా చట్టరిత్యా శిక్షార్హులవుతారని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులే పరీక్ష కేంద్రాల వద్దకు పిల్లల్ని చేర్చాలని సూచించారు.