
బాల కార్మికులతో పని చేపిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎంఓ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని బుధవారం బడిబయటి పిల్లల సర్వే లో భాగంగా చీకటిమామిడి, లక్ష్మితండ, సోలిపేట,బండాకాడిపల్లి గ్రామాల పరిధిలోని ఇటుకబట్టిలను సందర్శించి బడి బయటి పిల్లాల్ని గుర్తించడం జరిగింది.అనంతరం ఇట్టికబట్టీల యాజామాన్యలతో వర్క్ సైట్ పాఠాశాలల ఏర్పాటు గురించి మాట్లాడి, ఇటుక బట్టీలోనే పాఠశాల ఏర్పాటు చేసి బడిఈడు పిల్లలను చేర్చాలని తెలిపారు.బాల కార్మికులతో పని చేపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాలు వేంకటేష్,రమేష్, సిఅర్ పి లు విశ్వరూపం,జహంగీర్ పాల్గొన్నారు.