కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి 

Strict action should be taken against the management of the company– కలుషితనీరు తాగి మూగజీవాలు మృత్యువాత
నవతెలంగాణ_ బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలం రామలింగపల్లి పరిధిలో విషపూరితమైన కెమికల్ ను గ్రామాల్లోకి చెరువుల్లోకి వదులుతున్నారు.పలు కంపెనీల యజమాన్యం నిర్లక్ష్యం తోనే వ్యర్ధ రసాయనాలను కుంటలు చెరువులలోకి వదులుతున్న పరిశ్రమలు వ్యర్ధ రసాయన కలుషిత నీరు త్రాగి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. అదే గ్రామానికి చెందిన మచ్చని తిరుపతి పాడి గేదే కెమికల్ నీరు తాగి మృతి చెందింది. సుమారు ఒక లక్ష పదివేల రూపాయలు ఉంటుందని, వరద రసాయన నీరు త్రాగడం వలన పాడే గేదె మృతి చెందిందని గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు మృతి చెందిన పాడే గేదెతో నిరసన వ్యక్తం చేశారు.మొన్నటికి మొన్న స్థానిక రామయ్య చెరువులోకి కంపెనీ నుంచి రసాయన వ్యర్ధాలు తాగి బర్రెలు,గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు నల్లగొండ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు జిల్లా అధికారులు ఫిర్యాదు చేయడంతో వారం రోజుల క్రిందట వచ్చే ఎంక్వయిరీ చేయడం జరిగింది.కంపెనీ లోపల ఇతర పరిసరాలతో పాటు చెరువులోని నీటి శాంపిల్స్ సేకరించి పంపించినట్టు తెలిపారు. అది గడిచిన రెండు రోజులకే గేదె మృతి చెందడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వెంటనే కంపెనీపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. గ్రామపంచాయతీ పాలకవర్గం  కానీ అధికారులు పట్టించుకోకపోవడం కారణంగా రైతులు ఆ గేదెను గ్రామపంచాయతీ ఎదుట తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు.సదురు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.