అడవులలో పంట పొలాల చుట్టు విద్యుత్తు వైర్లు మనుషులకు జంతువులకు ప్రమాదాలు కలిగిస్తే పెద్దవిద్య చర్యలు తప్పవని పసర పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ఏ కమలాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్ లో గతంలో విద్యుత్ వైర్లు అమర్చి ప్రమాదాలకు పాల్పడిన వారితొ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కొందరు వ్యక్తులు తమ పంట పొలాలకు రక్షణ నిమిత్తం మరియు మరి కొంత మంది వన్యప్రాణులను వేటాడుట కొరకు కరెంట్ తీగలు, ఉచ్చులు అమరుస్తున్నారు అని వీటి వాళ్ళ మనుషుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని , గతం లో పసర పరిధిలో ఇటువంటి ఘటనలు జరిగిన దృశ్య రైతులు పంట రక్షణ కొరకు తమ పొలాల వద్ద కరెంట్ తీగలు పెట్టకూడదు అని , దీని కొరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియచేసారు. ఇక మీదట ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని,ఎవరైన కరెంటు వైర్లు,ఉచ్చులు పెట్టినచో పస్ర పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.