
చౌటుప్పల్ మండలంలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. దేవేందర్ బెల్టు షాపుల నిర్వాహకులతో ఆదివారం హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చౌటుప్పల్ డివిజన్ ఏసిపి ఉత్తర్వుల ప్రకారం ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. బెల్ట్ షాపుల నిర్వాహకులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు.గతంలో బెల్ట్ షాపుల నిర్వాహకులు తహసిల్దార్ ఎదుట బైండోవర్ అయి మళ్లీ బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.చౌటుప్పల్ మండల పరిధిలో వివిధ గ్రామాలలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే 100కు ఫోన్ కాల్ చేసి సమాచారం చెప్పాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.దేవేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.