నవతెలంగాణ- రాయపోల్
ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు అంబర్ లాంటివి విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ అన్నారు. మంగళవారం నమ్మదగిన సమాచారం మేరకు దౌల్తాబాద్ మండల కేంద్రంలో కిరాణా దుకాణంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌల్తాబాద్ మండల కేంద్రంలో నాగమల్లి భాస్కర్ కిరాణా దుకాణంలో ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు అంబర్, బ్లూబుల్, అమ్ముచున్నాడని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు దౌల్తాబాద్ పోలీసులు కలసి తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. తనిఖీలలో భాగంగా ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు టొబాకో ప్యాకెట్లు లభించాయని, విలువ రూ.8 వేల విలువ గలవి పట్టుకోవడం జరిగిందని వారిపై కేసు నమోదు చేసి పరిశోధన చేయడం జరుగుతుందన్నారు. అనంతరం టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధించిన గుట్కాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గ్రామాలలో,పట్టణాలలో ఇసుక, అక్రమ రవాణా చేసిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా గ్యాంబ్లింగ్, పేకాట, ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు కలిగి ఉన్న, రవాణా చేసిన మరి ఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, దౌల్తాబాద్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.