దాబాల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

– ఎస్సై కోనారెడ్డి,

– చిన్నతక్కడ పల్లి 36 దాబాకు నోటీసు పక్క వేస్తూనే వస్తాయి
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ : పెద్దకొడప్ గల్ మండలంలోని దాబాలకు నోటీస్ ఫ్లెక్సీలను అతికించారు ఈ సందర్భంగా ఎస్సై కొండారెడ్డి మాట్లాడుతూ దాబాలలో మద్యం సేవించిన దాబా యజమానులు మధ్య విక్రయించిన చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.దాబా హోటల్లో కేవలం ఆహార భోజనాలకు మాత్రమే అని మద్యం సేవించడం విక్రయించడానికి కాదని అన్నారు. ఇవన్నీ చెప్పిన దాబాల్లో మద్యాన్ని సేవించే అవకాశం గనక కల్పిస్తే దాబా హోటల్లు యజమానులపై కేసులు నమోదు చేసి దాబా హోటలను మూసివేస్తామని హెచ్చరించారు దాబా హోటల్ లో తాగి వాహనాలపై వెళ్తుంటే ప్రమాదాలకు గురి అవుతున్నారు కాబట్టి కచ్చితంగా దీన్ని అరికట్టాలని పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు దాబా హోటల్లో యాజమాన్యులకు తెలపడం జరిగిందని ఆయన అన్నారు.