నవతెలంగాణ – నూతనకల్
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల, అంగన్వాడి కేంద్రం, మండల పరిషత్ కార్యాలయం తాసిల్దార్ కార్యాలయంలో పరిశీలించే రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వర్షాకాలం సీజన్లో ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలకు బాలింతలకు పౌష్టిక ఆహారం విధిగా అందజేయాలని సూచించారు. పాఠశాలల్లో ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకొని మౌలిక సదుపాయాల గురించి అడిగారు. తాసిల్దార్ కార్యాలయంలో ధరణి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.