శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు 

– రౌడీ షిటర్ల మేళాలో పాల్గొన్న పోలీస్ కమీషనర్
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణ కొరకై పోలీస్ శాఖ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనివార్, ఐ.పి.యస్. తెలియజేశారు. ఈ మేరకు శనివారం పోలీస్ పరేడు గ్రౌండ్ లో రౌడీ షిటర్ల మేళా కార్యాక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సదర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్  కల్మేశ్వర్  సింగెనివార్, ఐ.పి.యస్ పాల్గొని పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.  పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో మొత్తం 326 మంది రౌడీ షీటర్లు ఉన్నారని, ఈ మేళాలో రౌడీషిటర్ల దినచర్యలను వారి రాకపోకలను క్షుణ్ణంగా తెలుసుకోవడం, వాళ్లు ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసారు, ఎందుకోసం కలుస్తున్నారు, భవిష్యత్తులో ఎలాంటి అల్లర్లకు / శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారు అనే దానివి తెలుసుకోవడం జరిగింది. కావున రౌడీ షిటర్లు వారు ప్రతీ రోజు వారి ఉద్యోగం నిర్వహించుకుంటు వారి ఇంటి వద్దనే ఉండాలని ఏ తగాదాలలో పాల్గొనవద్దని, ప్రధాన కూడళ్లలో సమావేశాలలు నిర్వహించకూడదని, రాత్రి సమయాల్లో హోటళ్ల వద్ద పాన్ షాపుల వద్ద ఉండరాదని తెలియజేశారు. ప్రతీ ఒక్క రౌడీ షిటరు తమ నడవడికను మార్చుకోవాలని, లేనియెడలవారి పై తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవ్వరికైనా వ్యక్తిగత ప్రతిష్టకుభంగం కలిచించడం లేదా సమాజంలో ఉద్రిక్తతలను రేపే విధంగా వ్యవహారించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ప్రతీసారీ చట్టప్రకారం కేసులు నమోదు అవుతుంటాయే వారిపై పి.డి యాక్టు నమోదు చేస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రొబైషనరీ ఐ.పి.ఎస్., బి. చైతన్య రెడ్డి, నిజామబాద్, ఆర్మూర్, బోధన్ ఎ.సి.పిలు  ఎల్. రాజా వెంకట్ రెడ్డి,  బస్వారెడ్డి,  పి. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్  శ్రీశైలం, సి.ఐలు, ఎస్.ఐలు మొదలగువారు పాల్గొనడం జరిగింది.