ప్రభుత్వ అనుమతులు లేకుండా చెట్లను నరికివేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ హెచ్చరించారు.శనివారం అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరంపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన పొలం వద్దనున్న రూ.10 వేల విలువైన రెండు దుర్షన్ చెట్లను నరికివేసిన కలప దళారులకు దుబ్బాక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్ ఆదేశాల మేరకు మూడింతల జరిమానాను విధించడం జరిగిందని.. అట్టి కలపదుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు.కలప వ్యాపారస్తులు ఎలాంటి చెట్లను నరికివేయాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు.ఆయన వెంట బీట్ ఆఫీసర్ వెంకటేష్ ఉన్నారు.