నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని బుధువరం నాడు ఎస్ఐ కొనారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి 16 అంజని గేటు వద్ద వాహనాలను తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ కొనారెడ్డి మాట్లాడుతూ వాహనదారులు ద్విచక్ర వాహనాలకు వెనుక ముందర భాగంలో తప్పక నంబర్ ప్లేట్ ఉంచుకోవాలని లేని యెడల వాహనాలు సీజ్ చేసి పొలీస్ స్టేషన్ కి తరలించి వాహనదారునిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. వాహనదారులు వాహనాలపై ప్రయాణం చేసే సమయంలో వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకొని రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. పాత చాలాన్ ను వెంటనే చెలించాలని కోరారు.