మహిళలను, విద్యార్థినులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు

If women and students are harassed, strict action will be taken– మహిళలను, బాలికలను, విద్యార్థినులను వేధిస్తున్న 22 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్
నవతెలంగాణ – సిరిసిల్ల
మహిళలను విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం 22 మంది ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలను,బాలికలను,విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీలపై ఈ ఏడాదిలో 37 కేసులు, 40 పెట్టి కేసులు నమోదు చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని , పోలీస్ శాఖ మహిళా భద్రతకు  జిల్లా వ్యాప్తంగా షి టీమ్స్ ఏర్పాటు చేసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని పేర్కొన్నారు.  మహిళలను ,విద్యార్థినుల వేధించిన, వెంబడించిన సామాజిక మధ్యమాల ద్వారా వేధించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా జిల్లా షీ టీమ్ ని సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీ టీమ్ నంబర్ 87126 56425 డయల్ 100 కు సమాచారం ఇవ్వాలన్నారు. కౌన్సిలింగ్ లో అదనపు ఎస్పీ  వెంట షీ టీమ్ ఏ. ఎస్.ఐ ప్రమీల, మహిళ కానిస్టేబుల్ ప్రియాంక ఉన్నారు.