బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తే కఠిన చర్యలు

Strict measures for consumption of alcohol in public places – ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే సహించేది లేదు
– డిఎస్పి శివరాం రెడ్డి
– 54 బైక్ ల  స్వాధీనం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి హెచ్చరించారు.శనివారం రాత్రి నల్లగొండ పట్టణ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేయడంతో పాటుగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యపానం సేవించడంతో పాటు రాత్రి సమయాలలో ద్విచక్ర వాహనాలతో రోడ్లపై హల్ చల్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ కలపించే విషయంలో పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు. ఇకపై ప్రతినిత్యం పట్టణంలోని వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగ మద్యపానం చేసే వారిపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారి వివరాలను డయల్ 100 ద్వారా సమాచారం ఇస్తే వెంటనే అక్కడకు చేరుకొని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నియంత్రణలో పోలీసులకు ప్రజలంతా సహకరించాలని కోరారు. శనివారం రాత్రి ఇద్దరు సిఐలు, పలువురు పోలీసు సిబ్బందితో 11 బృందాలుగా పట్టణంలో బహిరంగ మద్యపానం సేవిస్తున్న 50 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రాత్రి సమయాలలో ఇబ్బందులకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయడంతో పాటు నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై రోడ్లపై హల్ చల్ చేస్తూ వారి వద్ద నుండి 54 బైక్లను స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సిఐ డానియల్, ఎస్సైలు సందీప్ రెడ్డి, రాజు, శ్రీను పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.