గంజాయి విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు: డీఎస్పీ

– గంజాయి అమ్ముతున్న ఇద్దరు నిందుతుల అరెస్ట్..
– ఒక కిలో, 270 గ్రాముల గంజాయి సీజ్ : డీఎస్పీ నాగేంద్రచారి..
నవతెలంగాణ – వేములవాడ 
గంజాయి సేవించిన, రవాణా చేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవు,అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఇద్దరు నిందుతుల అరెస్ట్ చేయడం జరిగిందని.వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. శనివారం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, గంజాయి నిందుతులకు సంబంధించిన అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ..అల్లూరి సీతారాంనగర్, మంచిర్యాల చెందిన ప్రస్తుతం వేములవాడ పట్టణం లోని శాస్త్రి నగర్ లో నివాసం ఉంటున్న, పరిగిపండ్ల అన్వేష్ @బన్నీ (26) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ, మరో వ్యక్తి వేములవాడ లోని సుభాష్ నగర్ కి చెందిన మర్రిపల్లి సురేష్ (27) అనే ఇద్దరు వ్యక్తులు  శుక్రవారం  సాయంత్రం సమయంలో వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగాయపల్లి గ్రామం శివారులో రైతు వేదిక వెనుకాల ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయిని అమ్ముతున్నారన్న నమ్మదగిన  సమాచారం మేరకు వేములవాడ రూరల్ ఎస్.ఐ మారుతి తన సిబ్బంది తో అక్కడికి వెళ్లగా అక్కడ ఉన్న ఇద్దరు  వ్యక్తులు పోలీస్ వాహనాన్ని చూసి పారిపోవుటకు ప్రయత్నంచగా  ఎస్.ఐ తన సిబ్బందితో వారిని వెబడించి పట్టుకొని స్టేషన్ కు తరలించారు. మొదటి వ్యక్తి తన చేతిలో ఉన్న బ్యాగ్ ఓపెన్ చేయగా టేప్ తో చుట్టబడిన గంజాయి ప్యాకెట్  1 కిలో 270 గ్రాముల గంజాయిని సీజ్ చేసి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు.  గతంలో ఈ ఇద్దరు గంజాయి నీ వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో ఐస్ క్రీమ్ బండి నడిపే శ్యామ్ దివాకర్, కుమ్మరి మల్లికార్జున్  భాను లు అను వారి దగ్గర కొనుగోలు చేసి గంజాయి తాగడానికి అలవాటు పడి, వాళ్ళ దగ్గర గంజాయి కొని అమ్మగా వచ్చే డబ్బులతో జలసాలకు, మత్తుకు  అలవాటు పడ్డారని అన్నారు. వీరితో పాటు మరికొంతమంది గంజాయి తాగుడుకు అలవాటు పడిన వేములవాడ లోని  సుబాష్ నగర్ కి చెందిన భూమేష్, అంబేడ్కర్ నగర్ కి చెందిన సచిన్  అగ్రహారం కి చెందిన సాయిల కు అమ్మేవారు.శ్యామ్ దివాకర్, కుమ్మరి మల్లికార్జున్, భాను, భూమేష్, సచిన్  సాయి లు పరారీలో ఉన్నారని వారిని త్వరలో పట్టుకోవడం జరుగుతుంది అన్నారు.
జిల్లాలో గంజాయి నిర్ములనకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని అన్నారు. గంజాయి కొన్న, సేవించిన, రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని  డిఎస్పీ  హెచ్చరించారు. జిల్లాలో గంజాయి కి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి లేదా, డయల్100 కి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.